
బెంగుళూరు : లాక్ డౌన్ తో నిలిచిపోయిన అంతరాష్ట్ర సర్వీసులను కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించింది. కరోనా సెకండ్ వేవ్ ఎక్కువ అవడంతో రాష్ట్రంలోని అన్ని సర్వీసులను కె ఎస్ ఆర్ టి సి రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల లోని లాక్ డౌన్ ఆంక్షలు తగ్గించడంతో రేపటి నుండి కె ఎస్ ఆర్ టి సి చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. రేపు ఉదయం 6 గంటల నుండి ఏపీ కు సర్వీసులు మొదలవుతాయని అలాగే ఏపీలో ఆంక్షలు కొనసాగుతుండడంతో సాయంత్రం 6 గంటల కల్లా చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
బస్సుల్లో ప్రయాణించే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు వేసుకోవాలి అన్నారు. కరోనా నిబంధనలను అందరూ పాటిస్తూ ప్రయాణాలకు సంబంధించిన టికెట్లను కె ఎస్ ఆర్ టి సి వెబ్ సైట్ లలో బుక్ చూసుకోవచ్చు అని మరింత సమాచారం కోసం ఎస్ ఆర్ టి సి కాల్ సెంటర్ నెంబర్ 080 – 26252625 సంప్రదించవచ్చన్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న 13 జిల్లాల్లో మాత్రం నెల 21 నుంచి జూలై 5 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం యడ్యూరప్ప శనివారం స్పష్టం చేశారు.