
వేలూరు (తమిళనాడు) : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెళ్లి చూపులు కి వెళ్లి వస్తూ జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర బాధను నింపింది. వివరాల్లోకి వెళితే చెన్నై నందనం నగర్ చెందిన చంద్రమౌళి ఇ అతని భార్య వసుంధర 45, కుమారుడు వేణుగోపాల్ 26 వీరు ముగ్గురు కలిసి ఇ పెళ్లి సంబంధం చూడడం కొరకై బయలుదేరి మార్గమధ్యంలో రాణి పేట లో నివాసం ఉంటున్న తన తండ్రి కన్నయ్య 94 ఇతను కూడా తీసుకెళ్లారు. వేణుగోపాల్ ప్రైవేట్ బ్యాంకు లో క్యాషియర్ గా పని చేస్తున్నాడు. పెళ్లిచూపులు ముగిసిన అనంతరం సాయంత్రం తిరిగి కారులో బయలుదేరారు. కారు తిరుపత్తూరు జిల్లా సింగిల్ కుప్పం వద్ద హైవేపై ముందు వెళుతున్న లారీని అదుపుతప్పి వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కావడంతో కారు ముందు సీట్లో కూర్చున్న వేణుగోపాల్ అతని తాతయ్య కన్నయ్యన్ అక్కడికక్కడే మృతి చెందారు. చంద్రమౌళి ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి వీరిని పోలీసులు వేరే వాహనాలలో అంబుర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే మార్గమధ్యంలో వసుంధర మృతి చెందింది చంద్రమౌళి పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరు లోని సిఎంసి ఆస్పత్రికి తరలించారు. యాక్సిడెంట్ ని ఆలూరు తాలూకా పోలీసులు నమోదు చేసి ఇ దర్యాప్తు చేస్తున్నారు.