
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం రోజురోజుకు కుదురుతుంది. ఆర్ డి ఎస్ ప్రాజెక్టు విస్తరణలో మొదలైన ఈ వివాదం ఇప్పుడు నాగార్జునసాగర్ వరకు సాగింది. తెలంగాణ మంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పై మాటల తూటాలు పేలుస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పై సీఎం పై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుందాం అని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే మంత్రి బొత్స సత్యనారాయణ కొంచెం గట్టిగానే తెలంగాణ మంత్రులకు కౌంటర్ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడితే అక్కడ ప్రజలు బుద్ధి చెప్తారు అని పేర్కొన్నారు. ఈ నీటి పంపకాల విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వన్ టన్ గా ఉందని పేర్కొన్నారు. ఫెడరల్ వ్యవస్థలో ఎవరి ఆధారాలు వారికి ఉంటాయని , విభజన చట్టాలకు లోబడే నీటి పంపకాలు ఉంటాయని ఈ పరీక్షలు దాటితే వ్యవస్థలు జోక్యం చేసుకుంటాయని చెప్పారు. ఈ విషయంపై తెలంగాణ మంత్రులు తమను రెచ్చగొట్టేలా ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు.