
న్యూఢిల్లీ : ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాలపై కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు. అన్ని రాష్ట్రాల బోర్డులు ఇంటర్నల్ మార్కుల అసెస్మెంట్ పూర్తి చేసి జులై 31వ తేదీలోగా ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలను వెల్లడించాలని ఆదేశించింది. దీనిపై ఉన్నటువంటి పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. ప్రతి బోర్డు స్వయం ప్రతిపత్తి కలిగి ఉంది అందుకే బోర్డులు తమ సొంతం మూల్యాంకన విధానాలను రూపొందించుకునే హక్కు ఉందని కోర్టు పేర్కొంది.