
అహ్మదాబాద్: వ్యవసాయ రంగంలో ఉన్న సాంకేతికత గురించి రైతులకు తెలియాలని నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం రైతులకు స్మార్ట్ ఫోన్ ఓం కొనుగోలు చేసేందుకు ఒక్కొక్క రైతుకు 1,500 రూపాయలు సహాయాన్ని ఇస్తుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తర్వులు జారీ చేసింది. డిజిటల్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకొని వ్యవసాయ సంబంధిత ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలిపింది.
ఈ పథకానికి భూమి కలిగిన రైతులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని గుజరాత్ వ్యవసాయ శాఖ వెల్లడించింది. వాళ్ళు కొనే ఫోన్ల లో అయ్యే ఖర్చులో 1,500 కు మించకుండా 10 శాతం వరకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కొరకు ఐ- ఖేదుత్ పోర్టల్ లో దరఖాస్తు పెట్టుకోవాలని సూచించింది. అయితే ఈ పథకం ఫోన్ కు సంబంధించిన ఉపకరణాల కొనుగోలుకు ఈ పథకం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.